‘సర్’ పేరుతో ఓట్ల తొలగింపునకు కుట్ర
ABN , Publish Date - Jul 03 , 2026 | 06:17 AM
‘సర్’ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకు అనుకూలమైన ఓట్లు తొలగించేందుకు కుట్రలు చేస్తోందని, దీనివల్ల అర్హులైన లక్షలాది మంది..
ఆగస్టు 6 నుంచి 15 వరకు పాదయాత్రలు: సీపీఐ ఈశ్వరయ్య
కర్నూలు అర్బన్, జూలై 2(ఆంధ్రజ్యోతి): ‘సర్’ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకు అనుకూలమైన ఓట్లు తొలగించేందుకు కుట్రలు చేస్తోందని, దీనివల్ల అర్హులైన లక్షలాది మంది ఓటర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ఆరోపించారు. కర్నూలులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న సర్ ఓటర్ల ప్రక్రియ కోసం ఫారాలు కూడా పూర్తి చేయలే ని బీఎల్‌వోలను నియమించడం దారుణమన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ ఆగస్టు 6 నుంచి 15 వరకు సీపీఐ పాదయాత్రలు నిర్వహిస్తుందని తెలిపారు.