ఆవుపెయ్యికి నామకరణ ఉత్సవం
ABN , Publish Date - Mar 15 , 2026 | 04:21 AM
విజయనగరం జిల్లా జామి మండలంలోని భీమసింగి వేణుగోపాలస్వామి ఆలయంలో శనివారం ఆవుపెయ్యికి నామకరణ ఉత్సవం నిర్వహించారు.
విజయనగరం జిల్లా జామి మండలంలోని భీమసింగి వేణుగోపాలస్వామి ఆలయంలో శనివారం ఆవుపెయ్యికి నామకరణ ఉత్సవం నిర్వహించారు. గతంలో ఈ ఆలయ అర్చకుడికి ఒక దాత ఆవును దానంగా ఇచ్చారు. ఆ ఆవుకు ఈ నెల 4న పెయ్యి దూడ పుట్టింది. ఆ దూడకు 11వ రోజైన శనివారం గ్రామపెద్దలు, యువతను పిలిచి నామకరణ ఉత్సవాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఆవు పెయ్యిని ఉయ్యాల్లో ఉంచి, గోపికసావిత్రి అని నామకరణం చేశారు. వందలాది మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. నామకరణ ఉత్సవం నిర్వహించిన అర్చకుని కుటుంబాన్ని అభినందించారు.
- జామి, ఆంధ్రజ్యోతి