‘సీదిరి’కి మళ్లీ చుక్కెదురు
ABN , Publish Date - Jul 18 , 2026 | 04:51 AM
నిర్లక్ష్యంగా బైక్ నడిపి ఒకరి మరణానికి కారణమైన కేసులో వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను..
కొడుకు మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను పెండింగ్‌లో ఉంచిన సోంపేట కోర్టు
శ్రీకాకుళం, జూలై 17(ఆంధ్రజ్యోతి): నిర్లక్ష్యంగా బైక్ నడిపి ఒకరి మరణానికి కారణమైన కేసులో వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కోర్టు పెండింగ్‌లో ఉంచింది. వైద్య కారణాలు చూపుతూ ఆయన తరఫు న్యాయవాదులు పిటిసన్ దాఖలు చేశారు. అయితే, దానిపై అభ్యంతరాల వెల్లడికి సమయం ఇవ్వాలని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) కోరారు. దీంతో బెయిల్‌పై తదుపరి విచారణను పెండింగ్‌లో ఉంచుతూ న్యాయాధికారి కోడూరు కిషోర్ బాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దానికి ముందు జూలై 10 నాటి ఆరవ్ వర్మ మెడికల్ రిపోర్టులను న్యాయాధికారి పరిశీలించారు. బెయిల్ మంజూరు చేసేంత తీవ్రంగా యాక్సిడెంట్ గాయాలు లేవని స్పష్టం చేశారు. జైలులో వైద్యం అందించాలని ఆదేశించారు.