ముగిసిన కోర్టు ఉద్యోగాల రాత పరీక్ష
ABN , Publish Date - Feb 18 , 2026 | 11:33 PM
స్థానిక న్యాయ సేవాసదన భవనలో ఖాళీగా ఉన్న ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్, రికార్డు అసిస్టెంట్ రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి జరిగిన రాత పరీక్ష స్థానిక ప్రసూనా న్యాయ కళాశాలలో బుధవారం ప్రశాంతంగా ముగిసిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి తెలిపారు.
జిల్లా కోర్టు వెబ్‌సైట్‌లో ఫలితాలు విడుదల
కర్నూలు లీగల్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): స్థానిక న్యాయ సేవాసదన భవనలో ఖాళీగా ఉన్న ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్, రికార్డు అసిస్టెంట్ రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి జరిగిన రాత పరీక్ష స్థానిక ప్రసూనా న్యాయ కళాశాలలో బుధవారం ప్రశాంతంగా ముగిసిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి తెలిపారు. రాత పరీక్ష ముగిసిన వెంటనే అభ్యర్థుల ఓఎంఆర్ షీట్‌లను మూల్యాంకనం చేసి బుధవారం సాయంత్రం జిల్లా కోర్టు వెబ్‌సైట్‌లో వెల్లడించినట్లు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధితో కలిసి ఆయన వెల్లడించారు. వెబ్‌సైట్‌లో ఉంచిన జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 20వ తేదీన మౌఖిక పరీక్ష నిర్వహిస్తారని వారు తెలిపారు. ఈ మౌఖిక పరీక్షకు ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో హాజరు కావాలని తెలిపారు.