Share News

దళిత డ్రైవర్‌ హత్య కేసులో..అనంతబాబుకు షాక్‌

ABN , Publish Date - May 14 , 2026 | 05:47 AM

దళితుడైన తన డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టు షాకిచ్చింది..

దళిత డ్రైవర్‌ హత్య కేసులో..అనంతబాబుకు షాక్‌

  • వైసీపీ ఎమ్మెల్సీ బెయిల్‌ రద్దు చేసిన కోర్టు

రాజమహేంద్రవరం, మే 13(ఆంధ్రజ్యోతి): దళితుడైన తన డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టు షాకిచ్చింది. గతంలో ఆయనకు ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేసిం ది. హత్య కేసులోని సాక్షులకు బెదిరింపులు, ప్రలోభాలకు పాల్పడినట్లు తేలడంతో రాజమహేంద్రవరంలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. డ్రైవర్‌ హత్య కేసులో సాక్షులను అనంతబాబు, ఆయన అనుచరులు భయబ్రాంతులకు గురిచేశారని ఇటీవల కాకినాడ రూరల్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేయడం.. కొన్ని రోజుల కిందట ఆయన్ను పోలీసులు అరెస్టుచేయడం.. కోర్టు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఉన్నారు. అనంతబాబు సాక్షులను భయపెడుతున్నారని.. ఆయన బెయిల్‌ను తక్షణమే రద్దుచేయాలని ప్రముఖ న్యాయవాది, ఈ హత్య కేసులో స్పెష ల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ముప్పాళ్ల సుబ్బారావు జిల్లా కోర్టు లో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనికి సంబంధించి బుధవారం ఇరుపక్షాల వాదనలు ఆలకించిన కోర్టు.. అనంతబాబుకు గతంలో మంజూరుచేసిన బెయిల్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

Updated Date - May 14 , 2026 | 05:47 AM