Share News

ఇండియా వస్తే.. తిరిగి వెళ్తామో లేదో!

ABN , Publish Date - Mar 06 , 2026 | 04:41 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిబంధనలకు భయపడి.. స్వదేశానికి రాలేకపోయిన వధూవరులు.. బాపట్లలో జరిగిన లగ్నపత్రిక మహోత్సవాన్ని అమెరికా నుంచే వీడియో..

ఇండియా వస్తే.. తిరిగి వెళ్తామో లేదో!

  • ట్రంప్‌ వీసా నిబంధనలతో రాలేకపోయిన కాబోయే జంట

  • అమెరికాలో పెళ్లికి బాపట్లలో లగ్నపత్రిక వేడుక

  • వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వీక్షించిన కాబోయే దంపతులు

బాపట్ల, మార్చి 5(ఆంధ్రజ్యోతి): అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిబంధనలకు భయపడి.. స్వదేశానికి రాలేకపోయిన వధూవరులు.. బాపట్లలో జరిగిన లగ్నపత్రిక మహోత్సవాన్ని అమెరికా నుంచే వీడియో కాన్ఫరెస్సు ద్వారా తిలకించి సరిపెట్టుకున్నారు. బాపట్లకు చెందిన ప్రముఖ వ్యాపారి తటవర్తి సుబ్రహ్మణ్య గుప్తా కుమారుడు తటవర్తి నిషిత్‌ మహంత్‌, రాంభొట్లపాలేనికి చెందిన గుడివాడ మోహనరావు కుమార్తె మాధురికి వివాహం నిశ్చయమైంది. నిషిత్‌ డల్లా్‌సలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తుండగా, మాధురి అదే ప్రాంతంలో ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్నారు. వీరి వివాహాన్ని బాపట్లలోనే ఘనంగా నిర్వహించాలని భావించారు. ఇరు కుటుంబాలవారు మూడు నెలల క్రితం అమెరికా వెళ్లి అక్కడ నిశ్చితార్థం జరిపించారు. తర్వాత బాపట్లలో లగ్నపత్రిక మహోత్సవం, తదుపరి వివాహం ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అయితే, వీసా ఆంక్షల కారణంగా.. భారత్‌కుఉ వస్తే తిరిగి వెళ్లడానికి ఇబ్బందని కాబోయే వధూవరులు భయపడ్డారు. దీనికితోడు ఇరాన్‌ యుద్ధం కారణంగా అక్కడే ఉండిపోయారు. గురువారం బాపట్లలోని ఓ కల్యాణ మండపంలో ఇరువురి తల్లిదండ్రులతో లగ్నపత్రిక మహోత్సవాన్ని ఘనంగా జరిపారు. కాబోయే దంపతులు అక్కడి నుంచే వీక్షించారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ తదితర నాయకులు, బంధువులు, స్నేహితులు వారికి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Mar 06 , 2026 | 04:41 AM