630 వైద్య పోస్టులకు కౌన్సెలింగ్
ABN , Publish Date - Mar 20 , 2026 | 05:27 AM
రాష్ట్రవ్యాప్తంగా 630 మెడికల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీ కోసం అభ్యర్థుల జాబితాను ఆరోగ్యశాఖ సిద్ధం చేసింది. శాశ్వత విధానంలో ఎంబీబీఎస్ అర్హతతో ఈ పోస్టుల భర్తీ నిమిత్తం...
అమరావతి, మార్చి 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 630 మెడికల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీ కోసం అభ్యర్థుల జాబితాను ఆరోగ్యశాఖ సిద్ధం చేసింది. శాశ్వత విధానంలో ఎంబీబీఎస్ అర్హతతో ఈ పోస్టుల భర్తీ నిమిత్తం గతేడాది సెప్టెంబరులో నోటిఫికేషన్ జారీచేసింది. 630 పోస్టుల కోసం మొత్తం 4,984 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికి వచ్చే వారం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహించి, మెరిట్ ఆధారంగా పోస్టింగులు ఇవ్వనున్నారు. కౌన్సెలింగ్‌కు హాజరుకానున్న వారిలో 60 శాతం మంది మహిళలు ఉన్నారు. వారిలో ఎక్కువ మందికి ప్రాథమిక ఆరోగ్య కేందాల్ర్లో పోస్టింగులు ఇవ్వనున్నారు. కాగా, రోగులకు అందించాల్సిన సేవలను దృష్టిలో పెట్టుకుని జీరో వేకెన్సీ పాలసీ కింద ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. 20 నెలల్లో 2,053 వైద్యు ల పోస్టులు భర్తీ చేపట్టినట్లు చెప్పారు. ఇవి కాకుండా 5,800 పారా మెడికల్, 1,200 ఆశావర్కర్ల పోస్టులు భర్తీ చేశామన్నారు. త్వరలోనే పర్మినెంట్ విధానంలో 317 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు.