ఈ మేక ధర రూ.1.10 లక్షలు
ABN , Publish Date - May 24 , 2026 | 05:10 AM
అనంతపురం జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డుకు ఖరీదైన మేకపోతు వచ్చింది. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పూలంపల్లికి చెందిన నారాయణస్వామి ఈ మేకను పెంచి పోషించారు.
ఇంటర్నెట్ డెస్క్: అనంతపురం జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డుకు ఖరీదైన మేకపోతు వచ్చింది. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పూలంపల్లికి చెందిన నారాయణస్వామి ఈ మేకను పెంచి పోషించారు. దీని ధర ఏకంగా రూ.1.10 లక్షలు చెప్పడంతో చాలామంది బేరమాడి వెనుదిరిగారు. రూ.80 వేలు ఇస్తామన్నా నారాయణస్వామి తగ్గలేదు. బక్రీద్ పండుగ ఈ నెల 28న ఉండటంతో ముస్లింలు మార్కెట్‌కు వచ్చి పొట్టేళ్లు, మేకపోతులను కొనుగోలు చేశారు. ఖరీదైన మేకను చూసేందుకు ఆసక్తికనబరిచారు. కానీ కొనలేకపోయారు.
- అనంతపురం రూరల్, ఆంధ్రజ్యోతి