Share News

కార్పొరేట్‌ స్థాయి మాటలకే..

ABN , Publish Date - Jan 12 , 2026 | 11:27 PM

రాయలసీమ జిల్లాల పాలిట ఆరోగ్య సంజీవినిగా పేరొందిన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు అనారోగ్య జబ్బు పట్టింది.

   కార్పొరేట్‌ స్థాయి మాటలకే..

సర్వజనులకు కష్టాలు..

8 నెలల తర్వాత హెచడీఎ్‌స సమావేశం

నిలిచిన ఐపీడీ బ్లాక్‌, వరండాల్లోనే రోగులకు చికిత్స

రాయలసీమ జిల్లాల పాలిట ఆరోగ్య సంజీవినిగా పేరొందిన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు అనారోగ్య జబ్బు పట్టింది. రోజురోజుకు ఆస్పత్రికి రోగుల తాకిడి పెరుగుతున్నా వారికి అవసరమైన మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిదులు విఫలమవుతున్నారు. ప్రతి మూడు నెలలకు కలెక్టర్‌ అధ్యక్షతన జరగాల్సిన ఆసుపత్రి అభివృద్ది కమిటి (హెచడీఎ్‌స) నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదు. ఆసుపత్రిలో కార్పొరేట్‌ స్థాయి వైద్యం కల్పించడమే ధ్యేయమంటున్న ప్రజాప్రతినిధులు ప్రగల్బాలు మాటలకే పరిమితమయ్యారు. శిథిలావస్థకు చేరిన భవనాలు, వైద్యుల కొరత, ఐపీడీ బ్లాక్‌ నిర్మాణ పనులు ఆగిపోవడం, అధ్వాన్నంగా టీబీ వార్డు, నిధుల లేమితో సతమవుతుంది.

కర్నూలు హాస్పిటల్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో కార్పొరేట్‌ వైద్యం అందిస్తామన్నది మాటలకే పరిమితమైంది. 2025 ఏప్రిల్‌ 14వ తేదీ హెచడీఎ్‌స సమావేశం అప్పటి కలెక్టర్‌ పి.రంజిత బాషా అధ్యక్షతన, మంత్రి టీజీ భరత, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బొగ్గుల దస్తగిరి సమావేశంలో పాల్గొన్నారు. మళ్లీ సరిగ్గా 8 నెలల తర్వాత హెచడీఎ్‌స సమావేశం జరుగుతుంది.

గత హెచడీఎ్‌స కమిటీ తీర్మాణాలు..

ఆస్పత్రిలో 24 గంటలు కరెంటు ఉండేలా కరెంటు పోయిన వెంటనే వచ్చే విధంగా ఆటోమేటిక్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. నాలుగు జనరేటర్‌లో ఆటోమేటిక్‌ వ్యవస్థను అమలు పరిచారు. మంత్రి చొరవతో ఈ పనులు పూర్తయ్యాయి.

ఫ కొత్త సిటీ స్కాన కోసం సిబ్బందిని నియమించాలని ఆమోదం తెలిపినా అక్కడ ఇంత వరకు సిబ్బందిని నియమించలేదు. కనీసం టెక్నీషియనల అవసరం ఎంతో ఉంది.

ఫ హాస్పిటల్‌ అంతా కంప్యూటరైజ్‌, పేపర్‌లెస్‌ చేయాలి. ఈ పనులు ఇంకా కార్యరూపం దాల్చలేదు. పనులు నత్తనడకన సాగుతున్నాయి

ఫ ప్రధాన ద్వారం ఇనగేట్‌ను ఏర్పాటును ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించాలని కమిటీ ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పాటుచేసిన ఇనగేటు వద్ద ట్రాఫిక్‌ సమస్య తీవ్రమైంది. ఆటో డ్రైవర్లు, పండ్లు, ఇతర వ్యాపారులు ఆక్రమించుకుని రోగులను లోపలికి వెళ్లకుండా చేస్తున్నారు

ఫ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐపీడీ బ్లాక్‌కు నిధులు తెప్పించడానికి కృషి చేయాలని తీర్మానించారు. ఏపీఎంఎ్‌సఐడీసీ ఆధ్వర్యంలో నిర్వహించే ఐపీడీ బ్లాక్‌ పనులు నిధులు లేక ఆగిపోయాయి. కాంట్రాక్టర్‌కు రూ.20 కోట్లు పెండింగ్‌ బకాయిలు ఉన్నాయి. ఇంకా ఐపీడీ బ్లాక్‌కు రూ.140 కోట్లు బడ్జెట్‌ అవసరం ఉం

సమస్యలు ఇవే..

ఫ కొత్తగా వచ్చిన కలెక్టర్‌ ఏ.సిరి ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీలు చేసినా పరిపాలనలో ఏ మాత్రం మార్పు లేదు. హాస్పిటల్‌లో సూపరింటెండెంట్‌, ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్లు, సీఎ్‌సఆర్‌ఎంవో, డిప్యూటీ సీఎ్‌సఆర్‌ఎంవో, అడ్మినిస్ర్టేటర్‌, ఇనఛార్జి సీఎ్‌సఆర్‌ఎంవో, ఏఆర్‌ఎంవో, హాస్పిటల్‌ అడ్మినిస్ర్టేషన అధికారులు, ఏడీ, ఏవో అధికారులున్నారు. ఒకప్పుడు ఆర్‌ఎంవోలు లేకున్నా మెరుగైన సేవలు ఉండేవి. ప్రస్తుతం ఇంత మంది అధికారులు ఉన్నా మొక్కుబడిగా సేవలు అందిస్తున్నారు. సెలవు రోజుల్లో ఆసుపత్రిలో ఏదో ఒక వివాదం గానీ, దొంగతనాలు జరగడం సర్వసాధారణంగా మారింది.

ఫ ఎంఆర్‌ఐ విభాగాన్ని ప్రమోదిని సంస్థ 2018లో చేపట్టింది. మొదట్లో ఎంఆర్‌ఐ చేయించుకున్న వారికి ఒక్కక్క ఫిల్మ్‌కు రూ.200లు వసూలు చేసేవారు. ప్రభుత్వం ఒక ఎంఆర్‌ఐ పరీక్షకు రూ.2,650లు చెల్లిస్తుంది. అయితే ఇటీవల కాలంలో ప్రమోదిని సంస్థ నిర్వహణ బాధ్యతలను ఓ సబ్‌ కాంట్రాక్టర్‌కు అప్పగించింది. అయితే ఇటీవల కాలంలో ఒక ఎంఆర్‌ఐ ఫిల్మ్‌ను రూ.250ల నుంచి రూ.300కు పెంచి రోగులపై అదనపు భారం వేసింది.

ఫ సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహణ అస్థవ్యస్తంగా తయారైంది. కర్నూలు జీజీహచలో 238 మంది సెక్యూరిటీ గార్డులు, సూపర్‌వైజర్లు ఉండాల్సి ఉండగా.. 170 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.

ఫ పారిశుధ్యం కొంత మెరుగుపడినా మాతాశిశు సంరక్షణ కేంద్రం అయిన గైనిక్‌, చిన్నపిల్లల విభాగంలో పందుల సంచారం అధికంగా ఉంది.

ఫ వైద్యశాలలో ఎలుకలు, దోమలు, పాముల బెడద లేకుండా చూసేందుకు పెస్ట్‌ కంట్రోల్‌ను హైదరాబాదుకు చెందిన సాయి సెక్యూరిటీ సర్వీసెస్‌ సంస్థకు అప్పగించింది. అయితే ఈ ఏజెన్సీ నిర్లక్ష్యం వల్ల ఎలుకలు, దోమల బెడద అధికంగా ఉంది.

ఫ ఆసుపత్రిలో వీల్‌ చైర్లు, ట్రాలీల కొరత అధికంగా ఉంది. 1500 మంది అడ్మిషన రోగులను తరలించేందుకు వీల్‌ చైర్లు లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఎంఎనవో, ఎఫ్‌ఎనవో, స్టెచ్చర్‌ బాయ్‌ల కొరత తీవ్రంగా ఉంది. రోగుల బందువులే తీసుకెళ్లాల్సిన పరిస్థితి.

కలెక్టర్‌ అధ్యక్షతన సమావేశం

కలెక్టర్‌ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం 5 గంటలకు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స హాల్లో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరగుంది. మంత్రి టీజీ భరత, ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బొగ్గుల దస్తగిరి, అధికారులు పాల్గొంటారు. ఆస్పత్రి అభివృద్ధికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకొని తీర్మాణాలు చేస్తాం.

- డా.కే.వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్‌, కర్నూలు సర్వజన వైద్యశాల: (ఫోటో - 12 హాస్పిటల్‌-

Updated Date - Jan 12 , 2026 | 11:27 PM