పత్తికొండలో కార్డన సెర్చ్
ABN , Publish Date - Mar 07 , 2026 | 11:19 PM
పత్తికొండలో 70మంది పో లీసులతో కార్డన సెర్చ్ నిర్వహించారు.
పత్రాలులేని 64వాహనాలు సీజ్
పత్తికొండ, మార్చి 7 (ఆంధ్రజ్యోతి) : పత్తికొండలో 70మంది పో లీసులతో కార్డన సెర్చ్ నిర్వహించారు. శనివారం దుకాణాలు, అనుమా నితుల ఇళ్లు, పాతనేరస్థుల ఇళ్లలో సోదాలు జరిపారు. వాహనాల తనిఖీలో అనుమతిపత్రాలులేని 61 బైక్‌లు, మూడు ఆటోలను సీజ్ చేసి పోలీస్‌స్టేషనకు తరలించారు. అనంతరం డీఎస్పీ వెంకట రామయ్య మాట్లాడుతూ పట్టుబడిన వాహనాలకు సంబంధించి పత్రాలు చూపి వాహనాన్ని తీసుకెళ్లాలన్నారు. అలా చూపనిపక్షంలో ఆవాహనానికి సంబంధిం చిన వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తామన్నారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేం దుకు ఆపరేషన వజ్రపహార్ నిర్వహిస్తున్నామన్నారు. ఎక్కడైనా మత్తుమందుల విక్రయాలు జరుగుతున్నా అందుకు సంబంధించిన అనుమానాలు కలిగినా 1972టోల్‌ఫ్రీ నెంబర్‌కు సమాచారం ఇవ్వాల న్నారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. డీఎస్పీ ఆధ్వ ర్యంలో నాలుగుస్థంభాల కూడ లిలో ప్రజలతో ప్రతిజ్ఞ చేయిం చారు. పత్తికొండ సీఐ జయన్నతో పాటు ఆలూరు, ఆస్పరి, దేవనకొండ, ఆదోని స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలు పోలీసులు పాల్గొన్నారు.