Share News

కూల్‌ కూల్‌ ట్రాక్టర్‌ ..!

ABN , Publish Date - May 21 , 2026 | 04:55 AM

కారుకు ఏసీ ఉంటుంది. లారీల్లోనూ ఏసీ పెట్టుకునే సదుపాయం ఉంటోంది. మరి ఎప్పుడూ ఎండల్లో తిరిగే ట్రాక్టర్‌ డ్రైవర్‌ పరిస్థితి ఏమిటి.? ఇదే ఆలోచన ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన...

కూల్‌ కూల్‌ ట్రాక్టర్‌ ..!

చీమకుర్తి, మే 20(ఆంధ్రజ్యోతి): కారుకు ఏసీ ఉంటుంది. లారీల్లోనూ ఏసీ పెట్టుకునే సదుపాయం ఉంటోంది. మరి ఎప్పుడూ ఎండల్లో తిరిగే ట్రాక్టర్‌ డ్రైవర్‌ పరిస్థితి ఏమిటి.? ఇదే ఆలోచన ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన ట్రాక్టర్‌ యజమాని తూమాటి శ్రీనివాసరావుకు వచ్చింది. ఎండకు తరుణోపాయం ఆలోచించారు. తన ట్రాక్టర్‌కు ఏసీ క్యాబిన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఎంత ఎండైనా సరే ఏసీ క్యాబిన్‌లో కూర్చుని కూల్‌గా నడుపుకుంటున్నారు. అయితే ఏసీ కోసం దాదాపు రూ. 2.5 లక్షలు ఖర్చుచేశారు. అయినా చాలా సంతోషంగా ఉందని శ్రీనివాసరావుతో పాటు ఆయన కుటుంబసభ్యులు చెప్తున్నారు. ఎండతోపాటు వర్షాకాలంలోనూ ఇబ్బందిలేకుండా ట్రాక్టర్‌ తోలుకోవచ్చని, ఆరోగ్యపరంగా ఇబ్బందులుండవన్నారు. మైలేజి విషయంలో కూడా పెద్ద తేడా లేదని ఏసీ వేసుకుంటే లీటర్‌కు అర కిలోమీటర్‌ మాత్రమే తగ్గుతుందని శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - May 21 , 2026 | 04:55 AM