Higher Education Council: ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకం
ABN , Publish Date - Jan 14 , 2026 | 04:56 AM
వచ్చే విద్యా సంవత్సరంలో కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్లు)కు ఉన్నత విద్యామండలి మంగళవారం కన్వీనర్లను నియమించింది.
అమరావతి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): వచ్చే విద్యా సంవత్సరంలో కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్లు)కు ఉన్నత విద్యామండలి మంగళవారం కన్వీనర్లను నియమించింది. ఈసెట్‌కు జేఎన్‌టీయూ- అనంతపురం మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ బి.దుర్గా ప్రసాద్, ఐసెట్‌కు ఆంధ్రా యూనివర్సిటీ సీఎ్‌సఈ ప్రొఫెసర్ ఎం.శశి, పీజీఈసెట్‌కు ఆంధ్రా యూనివర్సిటీ ఈఈఈ ప్రొఫెసర్ పి.మల్లికార్జునరావు, లాసెట్‌కు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లా ప్రొఫెసర్ టి.సీతా కుమారి, ఎడ్‌సెట్‌కు ద్రవిడియన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ డి.శ్రీనివాస్ కుమార్, పీజీసెట్‌కు ఎస్వీ యూనివర్సిటీ కెమిస్ర్టీ ప్రొఫెసర్ వి.పద్మావతి, ఈఏపీసెట్‌కు జేఎన్‌టీయూ- కాకినాడ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఎన్.మోహన్‌రావు, పీఈసెట్‌కు నాగార్జున యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ పీపీఎస్ పాల్ కుమార్‌లను నియమించింది. బీపీఈడీ, యూజీ డీపీఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీఈసెట్ ప్రవేశ పరీక్ష మే లేదా జూన్ నెలల్లో ఉండొచ్చని తెలిపింది. మిగిలిన ప్రవేశ పరీక్షల తేదీలను గతంలోనే ప్రకటించింది.