Share News

NTR Health University: ఏంటీ నియామకం

ABN , Publish Date - Jan 02 , 2026 | 05:51 AM

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ‘సీవోఈ’ నియామకంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

NTR Health University: ఏంటీ నియామకం

  • ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ‘సీవోఈ’ నియామకంపై తీవ్ర అభ్యంతరాలు

  • రూల్స్‌ ప్రకారం వర్సిటీ అనుబంధ కాలేజీల ప్రొఫెసర్లకే సీవోఈగా చాన్స్‌

  • కానీ, తిరుపతి స్విమ్స్‌ నుంచి ఎంపిక

  • వర్సిటీ చరిత్రలోనే ఇది తొలిసారి

  • శ్రీకాంత్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ

అమరావతి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ‘సీవోఈ’ నియామకంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ (సీవోఈ)గా డా. సీహెచ్‌ శ్రీకాంత్‌ను నియమిస్తూ ఆరోగ్యశాఖ సెక్రటరీ సౌరబ్‌ గౌర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వర్సిటీకి సంబంధం లేనివ్యక్తిని ఈ పోస్టులో నియమించడం ఇది తొలిసారి. దీనిని వైద్యులు తప్పుబడుతున్నారు. నిబంధనల ప్రకారం హెల్త్‌ వర్సిటీ అనుబంధ కాలేజీల్లో విధుల నిర్వహిస్తున్న ప్రొఫెసర్లను ఈ పోస్టులో నియమించాలి. అయితే, డా. సీహెచ్‌ శ్రీనివాస్‌ ప్రస్తుతం తిరుపతి స్విమ్స్‌లో అనాటమీ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనను ఫారెన్‌ డిప్యుటేషన్‌ సర్వీసెస్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకువచ్చి.. సీవోఈగా నియమించారు. దీనిపై తీవ్ర అభ్యంతరాల వ్యక్తం అవుతున్నాయి. ‘ సీవోఈ’ పోస్టు అతి కీలకమైనది. వేల మంది వైద్య విద్యార్థుల భవిష్యతు సీవోఈ చేతుల్లోనే ఉంటుంటి. అలాంటి కీలకమైన పోస్టులో వర్సిటీ అనుబంధ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో విధులు నిర్వహించే ప్రొఫెసర్లను మాత్రమే ఇప్పటివరకూ నియమించారు. వర్సిటీ ప్రారంభమైన నాటి నుంచి ప్రభుత్వం ఈ నిబంధన పాటిస్తూ వచ్చింది. అందుకు భిన్నంగా ఈసారి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేది ఆరోగ్యశాఖ అధికారులే సమాధానం చెప్పాలి.

Updated Date - Jan 02 , 2026 | 05:52 AM