ఎండోమెంట్ ట్రైబ్యునల్ చైర్మన్ నియామకంలో గందరగోళం
ABN , Publish Date - Mar 21 , 2026 | 05:11 AM
ఎండోమెంట్ ట్రైబ్యునల్ చైర్మన్ నియామకంలో గందరగోళం ఏర్పడింది. రిటైర్డ్ జిల్లా జడ్జి ఎన్.నాగరాజును ఎండోమెంట్ ట్రైబ్యునల్ చైర్మన్‌గా...
చైర్మన్‌గా రిటైర్డ్ జిల్లా జడ్జి నాగరాజు నియామకం.. వెంటనే జీవో తొలగింపు
అమరావతి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ఎండోమెంట్ ట్రైబ్యునల్ చైర్మన్ నియామకంలో గందరగోళం ఏర్పడింది. రిటైర్డ్ జిల్లా జడ్జి ఎన్.నాగరాజును ఎండోమెంట్ ట్రైబ్యునల్ చైర్మన్‌గా నియమిస్తూ దేవదాయ శాఖ ఎక్స్‌అఫిషియో సెక్రటరీ డా.హరిజవహల్‌లాల్ శుక్రవారం సాయంత్రం జీవో 447 జారీ చేశారు. చైర్మన్‌గా ఆయన మూడేళ్ల పాటు లేదా.. 65 ఏళ్ల వయస్సు వరకూ ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే.. ఆ తర్వాత కొద్దిసేపటికే ఈ జీవోను వెబ్‌సైట్ నుంచి తొలగించారు.