Share News

గ్రామాభివృద్ధికి సహకరిస్తా

ABN , Publish Date - Feb 07 , 2026 | 11:48 PM

కప్పట్రాళ్ల గ్రామాభి వృద్ధికి తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు.

గ్రామాభివృద్ధికి సహకరిస్తా
క్యాలెండర్‌ ఆవిష్కరిస్తున్న ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ

ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ

కప్పట్రాళ్ల మహిళా సంఘాల క్యాలెండర్‌ ఆవిష్కరణ

దేవనకొండ, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): కప్పట్రాళ్ల గ్రామాభి వృద్ధికి తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. గ్రామ పొదుపు సంఘాల ఆధ్వర్యంలో రూపొందించిన గ్రామజ్యోతి నూతన సంవత్సరం క్యాలెండర్‌ను విజయవాడ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఈగల్‌ ఐజీ ఆవిష్కరించారు. గ్రామజ్యోతి లోగోనూ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా కప్పట్రాళ్ల గ్రామ ప్రజలతో కలిసి ముందుకు సాగడం ఎంతో ఆనందంగా ఉంద న్నారు. వారి అభివృద్ధిలో తాను భాగస్వామిగా ఉండడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఆకే రవికృష్ణ దంపతులను కప్పట్రాళ్ల గ్రామ ప్రజల తరపున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామజ్యోతి అధ్యక్షురాలు వీజీ భవాని, ప్రోగ్రాం మేనేజర్‌ బి.నారాయణ, నవోదయ వీఓఏ సరిత, గ్రామజ్యోతి కో ఆర్డినేటర్‌ చింతమాను రవికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 11:48 PM