ఒంటిమిట్టలో భక్తులకు నిత్య అన్నప్రసాదాలు
ABN , Publish Date - Mar 17 , 2026 | 06:00 AM
ఒంటిమిట్ట కోదండరాముని దర్శనానికి వచ్చే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాల పంపిణీ ప్రారంభమైంది.
ప్రారంభించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
ఒంటిమిట్ట, మార్చి 16(ఆంధ్రజ్యోతి): ఒంటిమిట్ట కోదండరాముని దర్శనానికి వచ్చే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాల పంపిణీ ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆలయ సమీపంలో నిరంతర అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఒంటిమిట్ట రామభక్తులకు మూడు పూ టలా అన్న ప్రసాదాలను అందిస్తామన్నారు. ఒంటిమిట్ట కోదండరాముని ఉత్సవాలను మార్చి 27 నుంచి ఏప్రిల్ 5 వరకు వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వెల్లడించారు. ఏప్రిల్ 1న సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.