Share News

రాజ్యాంగ హక్కులు అందరికీ అందాలి

ABN , Publish Date - Sep 28 , 2026 | 04:41 AM

భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, న్యాయ రక్షణ అందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలపై ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌ అన్నారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, గుత్తి పట్టణాల్లో ఆదివారం నూతన కోర్టు భవనాలను సీజే వర్చువల్‌గా ప్రారంభించారు.

రాజ్యాంగ హక్కులు అందరికీ అందాలి
HIGH COURT JUDGE

  • ఆ బాధ్యత న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలపై ఉంది

  • హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌

  • తాడిపత్రి, గుత్తిలో నూతన కోర్టు భవనాలు ప్రారంభం

తాడిపత్రి/గుత్తి, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, న్యాయ రక్షణ అందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలపై ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌ అన్నారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, గుత్తి పట్టణాల్లో ఆదివారం నూతన కోర్టు భవనాలను సీజే వర్చువల్‌గా ప్రారంభించారు. అదనపు న్యాయస్థానాల ప్రారంభోత్సవాలకు హైకోర్టు నుంచి జిల్లా వ్యవహారాల పర్యవేక్షణ పరిపాలన న్యాయమూర్తి జస్టిస్‌ భానుమతి, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సురేశ్‌రెడ్డి, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ హాజరయ్యారు. సీజే జస్టిస్‌ లిసాగిల్‌ వర్చువల్‌గా మాట్లాడుతూ.. న్యాయసేవలను ప్రజలకు చేరువగా తీసుకెళ్లేలా కృషి చేయాలని, న్యాయవాదులు ఆ దిశగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయాధికారి భీమారావు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2026 | 04:43 AM