రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
ABN , Publish Date - Feb 08 , 2026 | 04:17 AM
రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరికి బాధ్యత కావాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ అన్నారు.
జస్టిస్ గన్నమనేని రామకృష్ణ
గుంటూరు(విద్య), ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరికి బాధ్యత కావాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ అన్నారు. గుంటూరులోని జాగర్లమూడి చంద్రమౌళి న్యాయ కళాశాలలో శనివారం ప్రారంభమైన ఐదవ జాతీయస్థాయి మూట్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మూట్ కోర్టు పోటీల ద్వారా న్యాయ విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చని సూచించారు. నిరంతర కృషి ద్వారా న్యాయవాద వృత్తిలో రాణించవచ్చునని పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో న్యాయవాదుల పాత్రను ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు వివరించారు. ఈ పోటీలలో తొమ్మిది రాష్ర్టాల నుంచి 28 జట్లు పాల్గొంటున్నట్టు నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జాగర్లమూడి మురళీమోహన్, డాక్టర్ కొండబోలు కృష్ణ ప్రసాద్, ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ సుధాకర్ బాబు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.