కూటమిలో చిచ్చు పెట్టేందుకు కుట్రలు: మాధవ్
ABN , Publish Date - May 28 , 2026 | 05:09 AM
రాష్ట్రంలో కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టాలని కొందరు కుట్రలు చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలించవు. ఎటువంటి ముసుగు వేసుకున్నా ...
విశాఖపట్నం, మే 27(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టాలని కొందరు కుట్రలు చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలించవు. ఎటువంటి ముసుగు వేసుకున్నా వారిని వదిలిపెట్టబోం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ‘జనసేన, బీజేపీ మధ్య విభేదాలు సృష్టించాలని ఇటీవల ఒక విశ్లేషకుడు యత్నించారు. తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఆ వ్యాఖ్యలు ఆయన వెనక్కి తీసుకున్నారు. జగన్మోహన్‌రెడ్డితో సహా ఎవరు పాపాలు చేసినా పరిహారం చెల్లించుకోక తప్పదు. ‘సర్’లో ప్రజలు భాగస్వాములు కావాలి. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకువెళతాం. జూన్ 1 నుంచి 30 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం’ అని మాధవ్ తెలిపారు.