రానున్న రోజుల్లో కాంగ్రెస్ కనుమరుగు: సత్యకుమార్
ABN , Publish Date - May 09 , 2026 | 04:58 AM
రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. వరుస ఓటములతో ఇప్పటికే ఉనికి కోల్పోయి ఇతర పార్టీలపై అధారపడి...
తిరుపతి(కల్చరల్), మే 8(ఆంధ్రజ్యోతి): రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. వరుస ఓటములతో ఇప్పటికే ఉనికి కోల్పోయి ఇతర పార్టీలపై అధారపడి ఒకట్రెండు స్థానాల్లో పోటీ చేయాల్సిన పరిస్థితి ఆ పార్టీకి ఏర్పడిందన్నారు. తిరుపతిలోని తాతయ్యగుంట గంగ జాతర ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సారెను సమర్పించిన ఆయన ఆలయం బయట మీడియాతో మాట్లాడారు. దేశంతోపాటు రాష్ర్టాలను సంవత్సరాలపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ పలుమార్లు రాష్ట్రపతి పాలన తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రంలో ఎన్‌టీ రామారావు ప్రభుత్వాన్ని కూలదోసిన విషయాన్ని గుర్తుచేశారు. అటువంటి కాంగ్రెస్‌కు ఇప్పుడు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడమే డీఎంకేకి శాపంగా మారి అధికారాన్ని కోల్పోయిందని తెలిపారు. తమిళనాడులో జగన్ ఫొటోతో విజయ్ గెలిచాడంటూ వైసీపీ నేతలు చెప్పుకోవడం వారి మానసిక స్థితిని తెలియజేస్తోందని మంత్రి ఎద్దేవా చేశారు.