Share News

రామకృష్ణ తల్లి అంత్యక్రియలు పూర్తి

ABN , Publish Date - May 03 , 2026 | 05:10 AM

సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ తల్లి గౌరమ్మ అంత్యక్రియలు కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంలో శనివారం ముగిశాయి.

రామకృష్ణ తల్లి అంత్యక్రియలు పూర్తి

  • ఫోన్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ పరామర్శ

  • సంతాపం తెలిపిన డిప్యూటీ సీఎం పవన్‌

అమరావతి, ఆలూరు, మే 2(ఆంధ్రజ్యోతి): సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ తల్లి గౌరమ్మ అంత్యక్రియలు కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంలో శనివారం ముగిశాయి. రామకృష్ణను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ పరామర్శించారు. గౌరమ్మ మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం... రామకృష్ణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామకృష్ణ మాతృమూర్తి మరణంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ విచారం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మాజీ సీఎం జగన్‌ సంతాపాన్ని ప్రకటించారు.

Updated Date - May 03 , 2026 | 05:11 AM