ఆదోని జిల్లాతోనే సమగ్రాభివృద్ధి
ABN , Publish Date - Apr 27 , 2026 | 11:47 PM
పశ్చిమ ప్రాంత ఐదు నియోజకవర్గాలను కలిపి ఆదోని జిల్లాగా చేస్తే సమగ్రాభివృద్ధి చెందుతుందని ఆదోని జిల్లా జేఏసీ నాయకులు దేవిశెట్టి ప్రకాష్, కోదండ, సుజ్ఞానమ్మ కోరారు.
ఆదోని అగ్రికల్చర్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి) : పశ్చిమ ప్రాంత ఐదు నియోజకవర్గాలను కలిపి ఆదోని జిల్లాగా చేస్తే సమగ్రాభివృద్ధి చెందుతుందని ఆదోని జిల్లా జేఏసీ నాయకులు దేవిశెట్టి ప్రకాష్, కోదండ, సుజ్ఞానమ్మ కోరారు. పట్టణంలోని కోట్ల సర్కిల్‌లో జేఏసీ చేపట్టిన రిలే దీక్షలు సోమవారానికి 163వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన పశ్చిమ ప్రాంత నియోజకవర్గాలు ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం పత్తికొండ అభివృద్ధి చెందకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు మహా నగరాలకు వలస వెళుతున్నారన్నారు. సరైన విద్య వైద్యం లేక ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. పాలకులు సాగు, తాగునీరు ప్రాజెక్టుల నిర్మాణంలోనూ అన్యాయం చేశారని ఆరోపించారు. తమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆదోని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీక్షలో రామాంజనేయులు, వెంకోబా, పాండురంగ, రామకృష్ణ, బసాపురం మల్లయ్య కూర్చున్నారు.