ఏకీకృత సర్వీసు ప్రక్రియ పూర్తిచేయాలి: ఏపీటీఎఫ్
ABN , Publish Date - Jan 08 , 2026 | 05:01 AM
నిలిచిపోయిన ఉమ్మడి సర్వీస్ రూల్స్ ప్రక్రియను పూర్తిచేయాలని ఏపీటీఎఫ్ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు.
అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): నిలిచిపోయిన ఉమ్మడి సర్వీస్ రూల్స్ ప్రక్రియను పూర్తిచేయాలని ఏపీటీఎఫ్ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో ఏపీటీఎఫ్ నేతలు జి.హృదయరాజు, ఎస్.చిరంజీవి బుధవారం సచివాలయంలో సీఎంను కలిసి పలు సమస్యలు వివరించారు. 12వ పీఆర్‌సీ గడువు ముగిసి 29 నెలలు దాటిపోయిందని, అందువల్ల 30శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని కోరారు. స్థానిక సంస్థల్లో కారుణ్య నియామకాల ప్రక్రియ చేపట్టాలని, రిటైరైన ఉద్యోగులకు గ్రాట్యుటీ, సరెండర్ లీవు బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.