క్రీడాకారులను ప్రోత్సహించేందుకే పోటీలు
ABN , Publish Date - Jul 29 , 2026 | 12:17 AM
గ్రామీణప్రాంత విద్యార్థులలో దాగిఉన్న క్రీడాప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకే రాష్ట్రప్రభుత్వం అమరావతి చాంపియన స్కూల్‌గేమ్స్‌ను నిర్వహిస్తుందని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు.
పత్తికొండ, జూలై 28(ఆంధ్రజ్యోతి): గ్రామీణప్రాంత విద్యార్థులలో దాగిఉన్న క్రీడాప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకే రాష్ట్రప్రభుత్వం అమరావతి చాంపియన స్కూల్‌గేమ్స్‌ను నిర్వహిస్తుందని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. మంగళవారం పత్తికొండ క్రీడామైదానంలో నియోజకవర్గస్థాయి అమరావతి చాంపియన్స స్కూల్‌గేమ్స్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభ ఉన్నా కూడా గుర్తింపులేని ఎందరో క్రీడాకారులు గ్రామీణప్రాంతాలలో ఉన్నారన్నారు. అలాంటి క్రీడాకారులను గుర్తించి ప్రతిభ ఆధారంగా జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిల క్రీడలలో అవకాశం కల్పిస్తారన్నారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ కోఆర్డినేటర్ చందునాయక్, వ్యాయామ ఉపాధ్యాయులు పాండు, వేణు, రంగా, రంగయ్య, సంజప్ప, మధు, అంజి, రాము, విష్ణు, నరసన్న, హరి తదితరులు పాల్గొన్నారు.