Share News

పరిహారం చెల్లించాలి

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:48 PM

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే నష్టప రిహారం చెల్లించాలని ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎ్‌ఫటీయూ, ఐఎనటీయూసీ నాయకులు డిమాండ్‌ చేశారు.

పరిహారం చెల్లించాలి
సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న కార్మిక సంఘ నాయకులు

కార్మిక సంఘాల నాయకుల డిమాండ్‌

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళన

ఏవోకు వినతి పత్రం అందజేత

ఆదోని అగ్రికల్చర్‌, జూలై 3(ఆంధ్రజ్యోతి) : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే నష్టప రిహారం చెల్లించాలని ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎ్‌ఫటీయూ, ఐఎనటీయూసీ నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. సీఐటీయూ పట్టణ అధ్యక్షుడు పీఎస్‌ గోపాల్‌ మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో పదిమంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. 50మందికి పైగా గాయాలు పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. మరణించిన ఒక్కో కార్మికుని కుటుంబా నికి రూ. కోటి, గాయపడిన వారికి రూ. 50 లక్షల ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేటీకరణ ఆపాలని కోరారు. కార్మికులకు రక్షణ కల్పించి నష్టపోయిన కార్మికులను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ పట్టణ అధ్యక్షుడు ఓబి నాగరాజ్‌, ఐఎ్‌ఫటీయూ జిల్లా కార్యదర్శి వెంకప్ప, నాయకులు భీమేష్‌, తిప్పన, నరసన్న, మల్లికార్జున, కృష్ణమూర్తి, హనుమంతు, గని, నారాయణ సూరి పాల్గొన్నారు.

విశాఖ స్టీల్‌ ప్రమాద బాధితులను ఆదుకోవాలి

పత్తికొండ టౌన్‌: విశాఖ స్టీల్‌ ప్రమాద దుర్ఘటనలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా రూ.కోటి చొప్పున చెల్లించాలని ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు నెట్టెకంటయ్య, రంగన్న డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయ అధికారులకు నాయకులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దుర్ఘటనపై న్యాయవిచారణ జరిపి అందుకు బాధ్యులైన దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. స్టీల్‌ ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలను పాటించాలన్నారు. కార్యక్రమంలో సోమశేఖర్‌, రంగన్న, అశోక్‌, శేఖర్‌, శివ పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2026 | 11:48 PM