Share News

అవయవదానానికి ముందుకు రావాలి

ABN , Publish Date - Apr 08 , 2026 | 12:01 AM

అవయవ దానానికి యువత ముందుకు రావాలని అని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్‌, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అది నాగేష్‌, డాక్టర్‌ మాలకొండయ్య పేర్కొన్నారు.

అవయవదానానికి ముందుకు రావాలి
మాట్లాడుతున్న ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్‌

ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్‌

ఎమ్మిగనూరు టౌన/ రూరల్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): అవయవ దానానికి యువత ముందుకు రావాలని అని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్‌, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అది నాగేష్‌, డాక్టర్‌ మాలకొండయ్య పేర్కొన్నారు. మంగళవారం కుర్ణి కల్యాణ మండపంలో ఎమ్మిగనూరు మండల వైద్యుల సహకారంతో జరిగిన అవయవ దానం అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. మనిషి జీవితానకి ఉన్న అత్యున్నత విలువ మరో మనిషి ప్రాణాన్ని కాపాడటమేనని మనం ఈ లోకాన్ని విడిచిపొయిన తరువాత కూడా మరొకరి జీవితంలో వెలుగు నింపడమనేది నిజమైన మానవ సేవ అన్నారు. గుండె, మూత్రపిండాలు, కాలేయం వీటి కోసం ఆసుపత్రుల్లో ప్రాణాల అంచులపై ఎదురుచూస్తున్నారని, ఒక వ్యక్తి స్వచ్చందంగా అవయవ దానం చేస్తే ఎనిమిది మందికి పైగా ప్రాణాలు కాపాడిన వారవుతారన్నారు.ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా 103 మంది అవయవదానం నమోదు చేయడం జరిగిందన్నారు. ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి యుగంధర్‌, డాక్టర్‌ శిల్పా, డాక్టర్‌ హెమంత, డాక్టర్‌ మనోజ్‌, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంపన్న గౌడ్‌, ఏఐటియుసీ తాలుకా కార్యదర్శి తిమ్మగురుడు ఎఐవైఎప్‌ నాయకులు రాజీవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2026 | 12:01 AM