Andhra Jyothi Muggula Competition: రమ్యంగా రంగవల్లులు
ABN , Publish Date - Jan 06 , 2026 | 04:33 AM
ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు(పవర్డ్ బై సన్‌ఫీ్‌స్ట మామ్స్ మ్యాజిక్ బిస్కెట్లు... టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా.
బాలికల నుంచి బామ్మల వరకు.. ‘ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీ’కి రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు(పవర్డ్ బై సన్‌ఫీ్‌స్ట మామ్స్ మ్యాజిక్ బిస్కెట్లు... టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా. ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ వారి భారత్‌వాసీ అగర్‌బత్తి) 2 తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటకల్లోని 81 కేంద్రాల్లో జనవరి 3,4,5 తేదీల్లో ఘనంగా జరిగాయి. 12 వేల మందికి పైగా మహిళలు పాల్గొని తమ రంగవల్లులతో సంక్రాంతి శోభను ఇనుమడింపజేశారు. ప్రతి కేంద్రంలో ప్రథమ బహుమతి రూ.6,000, ద్వితీయ బహుమతి రూ.4,000, తృతీయ బహుమతి రూ.3,000తోపాటు అనేక కన్సొలేషన్ బహుమతులను సొంతం చేసుకున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆంఽఽధ్రప్రదేశ్‌లోని 28 జిల్లాలు, తమిళనాడు, కర్ణాటక నుంచి ఎంపికైన 30 మంది మహిళలకు ఈ నెల 10న విజయవాడలో ఫైనల్ పోటీలు జరుగుతాయి. తెలంగాణలోని 33 జిల్లాల నుంచి ఎంపికైన 33 మంది మహిళలకు ఈ నెల 12న హైదరాబాద్‌లో ఫైనల్స్ జరుగుతాయి. ఫైనలిస్టులకు రూ.2,40,000కు పైగా బహుమతులు, ఇంకా గిఫ్ట్ హ్యాంపర్లు లభిస్తాయి. కాగా, ఏపీ జిల్లాల్లో ముగ్గుల పోటీల్లో పదేళ్ల వయసున్న బాలికల నుంచి 74, 96 ఏళ్ల బామ్మల వరకు ఉత్సాహంగా పాల్గొన్నారు. కర్నూలులో పోటీలకు స్థానిక స్పాన్సర్‌గా టీజీవీ గ్రూప్ జూనియర్ చైర్మన్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వ్యవహరించి బహుమతులు అందజేశారు. కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లాలో తొలిసారి నిర్వహించిన ముగ్గుల పోటీల్లో 40 మంది మహిళలు, మార్కాపురం జిల్లా కనిగిరిలో 365 మంది, గిద్దలూరులో 200 మందికిపైగా పాల్గొన్నారు. కనిగిరి పోటీల్లో 96 ఏళ్ల వృద్ధురాలు చలువాది గురవమ్మ ముగ్గు వేశారు. గత పదేళ్లుగా ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ముగ్గుల పోటీల్లో పాల్గొంటున్నట్టు తెలిపారు. బాపట్లలో 74 ఏళ్ల వృద్ధురాలు ఎం.వెంకటేశ్వరమ్మ కన్సొలేషన్ బహుమతి అందుకున్నారు.