కమాండ్ కంట్రోలు రూమును తనిఖీ చేసిన కలెక్టర్
ABN , Publish Date - Oct 19 , 2026 | 11:01 PM
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోలు రూమును కలెక్టర్ రాజాబాబు సోమవారం పరిశీలించారు
ఒంగోలు కలెక్టరేట్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోలు రూమును కలెక్టర్ రాజాబాబు సోమవారం పరిశీలించారు. కంట్రోలు రూములో పనిచేస్తున్న సిబ్బందితో కలెక్టర్ మాట్లాడారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి నమోదు చేయాలని సూచించారు. రిజిస్టర్లను పరిశీలించి నమోదు ప్రక్రియను సక్రమంగా చేయాలని ఆదేశించారు. సిబ్బంది అప్రమత్తతో విధులు నిర్వహించాలన్నారు. కమాండ్ కంట్రోలు, రూము, మీడియా సెంటర్‌లో అన్ని వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్ వెంట డిప్యూటీ కలెక్టర్ మాధూరి, ఎన్నికల విభాగ పర్యవేక్షకులు శ్రీనివాసరావు ఉన్నారు.