Chief Secretary Vijyanand: ముఖ్య జనాభా లెక్కల అధికారిగా కలెక్టర్
ABN , Publish Date - Jan 11 , 2026 | 04:52 AM
జన గణన-2027కు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.
జన గణన-2027కు అధికారుల నియామకం
అమరావతి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): జన గణన-2027కు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. జిల్లాల్లో ముఖ్య జనాభా లెక్కల అధికారిగా కలెక్టర్లను నియమించింది. అదనపు జనాభా లెక్కల అధికారిగా జయింట్ కలెక్టర్ వ్యవహరిస్తారు. జిల్లా రెవెన్యూ అధికారిని జిల్లా జనాభా లెక్కల అధికారిగా నియమించడంతో పాటు జిల్లా ప్లానింగ్ అధికారి, జిల్లా విద్యాధికారి, పంచాయతీరాజ్ ఆఫీసర్, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్, జిల్లా పరిషత్ సీఈవో, సర్వే అసిస్టెంట్ డైరెక్టర్లను జిల్లా అదనపు జనాభా లెక్కల అధికారులు ప్రభుత్వం నియమించింది.