ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు
ABN , Publish Date - Feb 13 , 2026 | 10:56 PM
అవుట్ సోర్సింగ్, ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసిన నిందితుడిని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుడు అరెస్టు
కర్నూలు క్రైం, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): అవుట్ సోర్సింగ్, ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసిన నిందితుడిని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ బాబుప్రసాద్ శుక్రవారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. చిత్తూరు జిల్లా కొత్తపల్లికి చెందిన మహేంద్రబాబు గతంలో పలు పత్రికా సంస్థల్లో యాడ్ డిపార్టుమెంటులో పనిచేశాడు. తర్వాత తిరుపతిలో అమరావతి బీఎన పేరుతో టీవీ కేబుల్ నెట్‌వర్క్ పెట్టుకొని జీవనం సాగించాడు. పలు దినపత్రికల్లో పని చేసే సమ యంలో ప్రైవేటు బిజినెస్ నిర్వాహకులు వారి కంపెనీలో పని చేసేందుకు వాంటెడ్ అనే యాడ్స్ ఇచ్చేవారు. ఆయాడ్స్ చూసి మహేంద్ర తానే నేరుగా వారికి ఫోనచేసి వారి అవసరాలకు తగ్గట్గుగా కొంతమందిని తయారుచేసి ఆర్డర్ కాపీని తయారు చేసి ఈమెయిల్‌కు పంపేవాడు. ఇలా ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పించేందుకు కొంత కమీషన తీసుకునేవాడు. ఉద్యోగాలు ఇప్పిస్తామని అనంతపురానికి చెందిన బాబయ్య, నంద్యాలకు చెందిన శంకర్ నారాయణ గుప్తలను మోసం చేసి కొంత మొత్తం వసూలు చేశాడు. నంద్యాల చెందిన నారాయణ గుప్తకు నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు కూడా అందించాడు. తిరుపతిలోని గుర్రంకొండ బాబు అనే వ్యక్తికి ఓ ఇనఫ్రా ప్రాజెక్టులో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే సెల్ టవర్స్ మెయింటెనెన్స చేసే కాంట్రాక్టు ఇప్పిస్తానని నమ్మించాడు. ఇందుకు రూ.2కోట్ల వరకు విశాఖపట్నం, ఢిల్లీకి చెందిన వారి అకౌంట్లలో జమ చేయించాడు. ఆతర్వాత సెల్ టవర్ మెయింటెనెన్స కాంట్రాక్టు ఇప్పించకుండా మోసం చేశాడు. ఇలా కర్నూలులో కూడా మోసం చేయడంతో టూటౌన పోలీస్‌స్టేషనలో కూడా కేసు నమోదైంది. నిందితుడి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ నాగరాజు ఉన్నారు.