Share News

మన్యంలో చలి గాలి తీవ్రత

ABN , Publish Date - Feb 12 , 2026 | 11:10 PM

మన్యం చలి గాలులు బలంగా వీస్తున్నాయి. గురువారం పొగమంచు పెద్దగా లేనప్పటికీ కనిష్ఠ ఉష్ణోగ్రతలు మాత్రం నమోదయ్యాయి.

మన్యంలో చలి గాలి తీవ్రత
పాడేరులో గురువారం పొగమంచును చీల్చుకుంటూ ఉదయిస్తున్న సూర్యుడు

అరకులోయలో 7.1 డిగ్రీలు

పాడేరు, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): మన్యం చలి గాలులు బలంగా వీస్తున్నాయి. గురువారం పొగమంచు పెద్దగా లేనప్పటికీ కనిష్ఠ ఉష్ణోగ్రతలు మాత్రం నమోదయ్యాయి. తెల్లవారుజాము నుంచి ఉదయం ఆరున్నర గంటల వరకు ఒక మోస్తరు పొగమంచు మాత్రమే కురిసింది. మధ్యాహ్నం మినహా మిగతా సమయాల్లో చలి ప్రభావం చూపింది. అరకులోయలో గురువారం 7.1, ముంచంగిపుట్టులో 8.0, పెదబయలులో 8.7, చింతపల్లిలో 10.4, జి.మాడుగులలో 10.8, కొయ్యూరులో 12.7, అనంతగిరిలో 16.3, డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Feb 12 , 2026 | 11:10 PM