రాష్ట్రంలో పెరిగిన చలి
ABN , Publish Date - Feb 07 , 2026 | 06:34 AM
కోస్తా, రాయలసీమల్లో చలి తీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2నుంచి 4డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.
విశాఖపట్నం, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): కోస్తా, రాయలసీమల్లో చలి తీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2నుంచి 4డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటలో శుక్రవారం 7.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తాలో పలుచోట్ల ఉదయం పొగమంచు కురిసింది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగి, పలుచోట్ల పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.