జీజీహెచలో కోల్డ్‌వార్!
ABN , Publish Date - May 14 , 2026 | 12:12 AM
కర్నూలు మెడికల్ కాలేజీలో రాష్ట్ర పరిశ్రమలు శాఖ మంత్రి టీజీ భరత అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
సూపరింటెండెంట్ వర్సెస్ శానిటేషన మేనేజర్
లోపాలను ఎత్తిచూపిన సూపరింటెండెంట్
ఒకరిపై ఒకరు మంత్రికి ఫిర్యాదు
కర్నూలు హాస్పిటల్, మే 13 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మెడికల్ కాలేజీలో రాష్ట్ర పరిశ్రమలు శాఖ మంత్రి టీజీ భరత అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆసుపత్రిలో కొంత కాలంగా జరుగుతున్న కోల్డ్‌వార్ బహిర్గతమైంది. సమీక్ష ప్రారంభమైన కాసేపటికే తమకు బిల్లులో మార్కుల కోత విధిస్తున్నారని పద్మావతి శానిటేషన ఏజెన్సీ మేనేజర్ రత్నరాజు మంత్రికి ఫిర్యాదు చేశారు. సాధారణంగా ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణలో మార్కుల ప్రాతిపదికన కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లిస్తారు. 100కు 95 మార్కులు హాస్పిటల్ సూపరింటెండెంట్ వెస్తేనే పూర్తి స్థాయి బిల్లులు ఏజెన్సీకి దక్కుతాయి. ఆసుపత్రిలో 399 మంది పారిశుధ్య సిబ్బంది పద్మావతి ఏజెన్సీ, ఔట్ సోర్సింగ్ కింద పని చేస్తున్నారు. అయితే.. పారిశుధ్య నిర్వహణకు సూపరింటెండెంట్ 94 మార్కులు వేశారనీ దీనివల్ల తాము ఇబ్బందులు పడుతున్నామనీ శానిటేషన మేనేజర్ మంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపై హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు స్పందిస్తూ పారిశుధ్య నిర్వహణలో లోపాలు ఉన్నాయనీ అందుకే 100కి 94 మార్కులు వేశామని వివరణ ఇచ్చారు. ఎఫ్‌ఆర్‌ఎస్ సరిగ్గా లేదని, తాము రౌండ్స్‌కు వెళ్లిన ప్రతీసారి ఏజెన్సీ మేనేజర్లు, సూపర్‌వైజర్లు కనిపించడం లేదని హాస్పిటల్ సూపరింటెండెంట్ మంత్రికి వివరించారు. ఉదయం 11 గంటలకు వెళ్తే రోగుల బాతరూంల నుంచి దుర్వాసన వస్తోందని, పారిశుధ్య సిబ్బంది చెత్తను తీసుకెళ్లడానికి కవర్లు ఇవ్వడం లేదని మంత్రికి వివరించారు. దీనిపై ఏజెన్సీ మేనేజర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో తాము పారిశుధ్య పనులు కాకుండా ఇతర పనులు చేస్తున్నామనీ, ముఖ్యంగా అత్యవసర విభాగాల్లో షిప్టునకు 40 మంది స్ర్టెచర్లు తోయడం, ఇతర పనులు చేయిస్తున్నారన్నారు. ఇరువర్గాల ఫిర్యాదులను విన్న మంత్రి మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు ఇతర పనులు చేయవద్దని, సూపరింటెండెంట్ ఆదేశించిన విధంగా షిప్టునకు 15 మంది స్ర్టెచర్ బాయ్‌గా సేవలందించాలన్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ మెమో జారీ చేస్తే దానికి తిరిగి సమాధానం ఇవ్వాల్సిందేనని ఏజెన్సీ మేనేజర్‌ను ఆదేశించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ 248 మంది ఎంఎనవో, ఎఫ్‌ఎనవోలు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, గతంలో ఏజెన్సీకి 250 మంది సిబ్బంది ఉన్నా సర్వే సె్ట్రచర్ బాయ్‌గా ఉపయోగించుకునే వాళ్లమన్నారు. ప్రస్తుతం 399మంది ఉండటం వల్ల అత్యవసర రోగులకు 15 మందిని షిప్ట్‌కు వినియోగిస్తున్నామన్నారు.