Share News

తీరం అభివృద్ధికి సమగ్ర ప్లాన్‌

ABN , Publish Date - May 26 , 2026 | 05:42 AM

రాష్ట్రంలోని సముద్ర తీరం అభివృద్ధికి సమగ్ర విజన్‌ ప్లాన్‌ తయారు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

తీరం అభివృద్ధికి సమగ్ర ప్లాన్‌

  • సముద్ర సంపద అందిపుచ్చుకునేలా కార్యాచరణ

  • తీరం కోతకు గురికాకుండా రక్షణ చర్యలు: చంద్రబాబు

అమరావతి, మే 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సముద్ర తీరం అభివృద్ధికి సమగ్ర విజన్‌ ప్లాన్‌ తయారు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా కోస్తాంధ్ర తీరం మారేలా ఈ ప్రణాళిక ఉండాలన్నారు. సముద్ర తీరం అభివృద్ధికి సంబంధించి.. నిపుణులు, అధికారులతో సోమవారం తాడేపల్లి క్యాంప్‌ ఆఫీ్‌సలో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉన్న వెయ్యి కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతంలో అభివృద్ధి ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మత్స్యకారులకు కలిగే ప్రయోజనాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలన్నారు. ‘ఆక్వా కల్చర్‌లో వాల్యూ అడిషన్‌ జరగాలి. మెరైన్‌ బయో డైవర్సిటీని కాపాడేలా చర్యలు చేపట్టాలి. సముద్ర తీర ప్రాంతాల్లో దొరికే రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌పై దృష్టి పెట్టి, ఆ వనరుల్ని అందిపుచ్చుకోవాలి. తీర ప్రాంత రక్షణపైనా దృష్టి పెట్టాలి. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా తీరంలో మడ అడవులు, తాటి చెట్లు పెంచి మూడంచెల రక్షణ కవచం ఏర్పాటు చేయాలి. పర్యాటకం, ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా సముద్ర తీరం తయారు కావాలి’ అని స్పష్టం చేశారు.

Updated Date - May 26 , 2026 | 05:43 AM