కోస్తా.. సీమలో చెదురుమదురు వర్షాలు
ABN , Publish Date - Mar 22 , 2026 | 04:21 AM
గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తమిళనాడు మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దక్షిణ కర్ణాటక పరిసరాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఆవరించింది.
విశాఖపట్నం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తమిళనాడు మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దక్షిణ కర్ణాటక పరిసరాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. మరోవైపు పలుచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. దీంతో వాతావరణ అనిశ్చితి నెలకొని శనివారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. శనివారం ఉదయం రాత్రి వరకు మంగళగిరిలో 35.75, పల్నాడు జిల్లా నెమలకళ్లులో 33, ఏలూరు జిల్లా రేచర్లలో 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా రాయలసీమలోని పలు జిల్లాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. కర్నూలులో 38.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.