AP GENCO MD: జెన్కో ఎండీగా అదనపు బాధ్యతలు చేపట్టిన పుల్లారెడ్డి
ABN , Publish Date - Jan 20 , 2026 | 05:38 AM
ఏపీ జెన్కో ఎండీగా, సీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి సోమవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు.
అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): ఏపీ జెన్కో ఎండీగా, సీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి సోమవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. దీంతోపాటు ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్, ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ సీఈవోగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘విద్యుత్తు రంగంలో నా అనుభవాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని నాకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తా’ అని పేర్కొన్నారు.