Share News

నేడు సూరంపల్లికి సీఎం రాక

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:59 AM

జిల్లాలో సీఎం చంద్రబాబు శుక్రవారం పర్యటించనున్నారు. గన్నవరం మండలం సూరంపల్లిలో ఏర్పాటు చేసిన పీఎం కిసాన్‌, అన్నదాత సుఖీభవ మూడో విడత పెట్టుబడిసాయం విడుదల కార్యక్రమానికి హాజరుకానున్నారు. తొలుత సాయంత్రం 4.20 గంటలకు కొండపావులూరులోని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బెటాలియన్‌ ప్రాంగణానికి హెలీకాప్టర్‌లో చంద్రబాబు వస్తారు.

నేడు సూరంపల్లికి సీఎం రాక

- గన్నవరం మండలంలో పర్యటన

- పీఎం కిసాన్‌, అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి హాజరు

-1,06,252 మంది రైతులకు రూ.74.80 కోట్ల పెట్టుబడి సాయం

మచిలీపట్నం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో సీఎం చంద్రబాబు శుక్రవారం పర్యటించనున్నారు. గన్నవరం మండలం సూరంపల్లిలో ఏర్పాటు చేసిన పీఎం కిసాన్‌, అన్నదాత సుఖీభవ మూడో విడత పెట్టుబడిసాయం విడుదల కార్యక్రమానికి హాజరుకానున్నారు. తొలుత సాయంత్రం 4.20 గంటలకు కొండపావులూరులోని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బెటాలియన్‌ ప్రాంగణానికి హెలీకాప్టర్‌లో చంద్రబాబు వస్తారు. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా సూరంపల్లికి 4.25 గంటలకు చేరుకుంటారు. అక్కడ రైతులతో 4.55 గంటల వరకు ముఖాముఖి మాట్లాడతారు. 5.00 గంటలకు ప్రజావేదిక వద్దకు చేరుకుని ప్రసంగిస్తారు. పీఎం కిసాన్‌, అన్నదాత సుఖీభవ నగదు చెక్కును రైతులకు అందజేస్తారు. రాత్రి 7.10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి వెళతారు. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు వివిధశాఖల అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు.

1,06,252 మంది రైతులకు రూ.74.80 కోట్లు

పీఎం కిసాన్‌, అన్నదాత సుఖీభవ మూడో విడత పెట్టుబడి సాయం కింద జిల్లాలో 1,06,252 మంది రైతులకు రూ.74.80 కోట్ల నగదును జమచేయనున్నారు. గన్నవరం నియోజకవర్గంలో 17,823 మంది రైతులకు రూ.13.53 కోట్ల నగదు జమ కానుంది.

Updated Date - Mar 13 , 2026 | 12:59 AM