Share News

లడ్డూ కల్తీపై మాట్లాడకూడదట..!

ABN , Publish Date - Mar 14 , 2026 | 04:57 AM

తిరుమల లడ్డూ అంశంపై ఎవరూ మాట్లాడకూడదని కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లారని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. గతంలోనూ వివేకానందరెడ్డి హత్య కేసులో గ్యాగ్‌ ఆర్డర్‌ తీసుకొచ్చారని గుర్తుచేశారు.

లడ్డూ కల్తీపై మాట్లాడకూడదట..!

  • వివేకా హత్య కేసులోనూ ఇలాగే చేశారు

  • కోర్టుకు వెళ్లి గ్యాగ్‌ ఆర్డరు తెచ్చారు: సీఎం

తిరుమల లడ్డూ అంశంపై ఎవరూ మాట్లాడకూడదని కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లారని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. గతంలోనూ వివేకానందరెడ్డి హత్య కేసులో గ్యాగ్‌ ఆర్డర్‌ తీసుకొచ్చారని గుర్తుచేశారు. ‘ఇప్పుడు కూడా కల్తీ నెయ్యితో లడ్డూను అపవిత్రం చేసి దాని గురించి ఎవరూ మాట్లాడకూడదని కోర్టులను ఆశ్రయిస్తున్నారు. పాపాలు, తప్పులు చేసి వాటిపై ఎవరూ మాట్లాడవద్దని కోర్టులకు వెళ్లడం సరైన పద్ధతి కాదు. చేసిన తప్పులు బయటపడతాయనే భయంతో కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అలాంటివారు రాజకీయాల్లో ఉండడానికి అర్హులా? గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమయ్యాయి. ఎంతో పవిత్రమైన తిరుమలను గత పాలకులు అపవిత్రం చేశారు. ప్రతి పనీ ప్రారంభించే ముందు నేను తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని తలచుకుంటా.’ అని సీఎం తెలిపారు.

Updated Date - Mar 14 , 2026 | 04:57 AM