అమరావతి అగ్ని ప్రమాదంపై సీఎం సమీక్ష
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:21 AM
అమరావతిలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం సమీక్ష జరిపారు. క
గుంటూరు, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం సమీక్ష జరిపారు. కలెక్టర్ల సదస్సు టీ బ్రేక్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ సహా సంబంధిత అధికారులతో ఆయన సమావేశమయ్యారు. అమరావతి పనులు జోరుగా జరుగుతున్న సమయంలో అగ్ని ప్రమాదం జరగడంపై అనుమానాలు వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. అన్ని కోణాల్లో సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో గత అనుభవాల దృష్ట్యా ఇది ప్రమాదమా, ఏదైనా కుట్ర దాగి ఉందా అనే విషయంలో కూడా విచారణ జరపాలని ఆయన ఆదేశించారు.