Share News

సీఎంవోకు జల్‌జీవన్‌ బిల్లుల పంచాయితీ

ABN , Publish Date - Mar 29 , 2026 | 04:05 AM

ఆర్‌డబ్ల్యూఎస్‌లోని జల్‌జీవన్‌ మిషన్‌ కాంట్రాక్టర్ల బిల్లుల పంచాయితీ సీఎం కార్యాలయానికి చేరింది.

సీఎంవోకు జల్‌జీవన్‌ బిల్లుల పంచాయితీ

అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ఆర్‌డబ్ల్యూఎస్‌లోని జల్‌జీవన్‌ మిషన్‌ కాంట్రాక్టర్ల బిల్లుల పంచాయితీ సీఎం కార్యాలయానికి చేరింది. ఈ పనులు నిర్వహించిన కాంట్రాక్టర్లు.. తమకు బిల్లులు చెల్లించడంలేదంటూ ఇటీవల మౌనదీక్ష చేశారు. ఈ విషయమై ఆర్థికశాఖ అధికారులను సీఎంవో వివరణ కోరింది. తాము కాంట్రాక్టర్లకు నేరుగా బిల్లులు చెల్లించలేదని, కేటాయించిన మొత్తం పీఆర్‌ శాఖకు విడుదల చేశామని, ఎవరెవరికి ఎంత చెల్లింపులు చేయాలన్న దానిపై పంచాయతీరాజ్‌ శాఖ అధికారులే నిర్ణయం తీసుకున్నారని ఆర్థిక శాఖ అధికారులు వివరణ ఇచ్చారు.

Updated Date - Mar 29 , 2026 | 04:07 AM