Share News

సీఎం చంద్రబాబు సభ సక్సెస్‌

ABN , Publish Date - Jul 26 , 2026 | 12:16 AM

ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరిలో ముఖ్యమంత్రి చంద్రబునాయుడు శనివా రం సంజీవని ప్రారంభోత్సవంలో పాల్గొనడంతో భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, కూటమి నాయకులు మహిళలు హా జరవడంతో ఆస్పరి కిక్కిరిసిపోయింది.

 సీఎం చంద్రబాబు సభ సక్సెస్‌
సభలో మాట్లాడుతున్న టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి

- టీడీపీ శ్రేణుల్లో జోష్‌

- భారీగా తరలివచ్చిన జనం

- పట్టు నిలుపుకున్న టీడీపీ

ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి

ఆలూరు, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరిలో ముఖ్యమంత్రి చంద్రబునాయుడు శనివా రం సంజీవని ప్రారంభోత్సవంలో పాల్గొనడంతో భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, కూటమి నాయకులు మహిళలు హా జరవడంతో ఆస్పరి కిక్కిరిసిపోయింది. ఎటు చూ సినా సీఎంకు స్వాగతం పలుకుతూ పార్టీ శ్రేణు ల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చే యడంతో పసుపు మయంగా మారింది. ఆస్పరి శివారులో కర్నూ లు రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రజలు ఉత్సాహంగా హాజరయ్యారు. భారీ ఎ త్తున వాహనాలు, బస్సులు తండోపతండాలుగా తరలిరావడంతో ప్రజా వేదిక కిటకిటలాడింది. దాదాపుగా 15 వేలకు పైగా ప్రజలు హాజరై ఉంటారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి.

కార్యకర్తలకు కృతజ్ఞతలు

సీఎం సభను విజయవం తం చేసేందుకు గత వారం రోజులుగా ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి, టీడీపీ నేత వైకుంఠం శివప్రసాద్‌లు కార్యకర్తలను, నాయకులను సమీకరించడంలో సఫలీకృతులయ్యారు. సీఎం సభకు కనివిని ఎరుగని రీతిలో జనం రావడంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొం ది. ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతూ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామని వైకుంఠం జ్యోతి అన్నారు. సీఎం సభను విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తలకు, నాయకులకు, కూటమి పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.

సీఎంను కలిసిన నాయకులు

తుగ్గలి/దేవనకొండ/చి ప్పగిరి /పత్తికొండ/ ఆదోని: ఆస్పరి మండలంలో సంజీవని కార్యక్ర మానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును హెలిప్యాడ్‌ ప్రాంగణంలో జొన్నగిరికి చెందిన టీడీపీ యువనేత మిద్దె వెంకటేశ యాదవ్‌ మ ర్యాదపూర్వకంగా కలి శారు. స్థానిక స మస్యలను వివరించి పరిష్కరించాలని కో రారు. దేవనకొండ, చిప్పగిరి, పత్తికొండ, ఆ దోని నుంచి నాయకులు సీఎంను కలిశారు.

Updated Date - Jul 26 , 2026 | 12:16 AM