Share News

Secretariat Employee Story: చిరుద్యోగి కళ్లలో ‘చంద్ర’ కాంతులు

ABN , Publish Date - Jan 08 , 2026 | 05:48 AM

ఇది మీరిచ్చిన జీవితం. ఆజన్మాంతం మీకు రుణపడి ఉంటాను. అంటూ రెండు చేతులు జోడించి సీఎం చంద్రబాబుకు నమస్కరిస్తున్న వ్యక్తి సచివాలయం లో పనిచేసే సాధారణ ఉద్యోగి శంకర్రావు.

Secretariat Employee Story: చిరుద్యోగి కళ్లలో ‘చంద్ర’ కాంతులు

  • బాబు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక టైపిస్టుగా ఉద్యోగం

  • తర్వాత ఇంటి స్థలం కూడా.. అప్పటి నుంచి కలుసుకోవాలని సెక్షన్‌ ఆఫీసర్‌ శంకర్రావు ఆకాంక్ష

  • రిటైర్మెంట్‌కు చేరువలో తీరిన కోరిక.. చిరుద్యోగిని ప్రేమగా

  • పలకరించిన సీఎం.. ఏ అవసరం వచ్చినా రావాలని భరోసా

అమరావతి, జనవరి 7(ఆంరఽధజ్యోతి): ‘‘ఇది మీరిచ్చిన జీవితం. ఆజన్మాంతం మీకు రుణపడి ఉంటాను.’’ అంటూ రెండు చేతులు జోడించి సీఎం చంద్రబాబుకు నమస్కరిస్తున్న వ్యక్తి సచివాలయం లో పనిచేసే సాధారణ ఉద్యోగి శంకర్రావు. సచివాలయంలో ఆయన సెక్షన్‌ ఆఫీసర్‌. అయితే, సీఎం చంద్రబాబుకు చిరకాల అభిమాని. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌(1996) ద్వారా శంకర్రావు సచివాలయంలో టైపి్‌స్టగా ఉద్యోగం పొందారు. అప్పటి వరకు ఉద్యోగం లేక నిస్పృహలో ఉన్న తన జీవితానికి ఆ నోటిఫికేషన్‌ దారిచూపిందని శంకర్రావు చెప్పారు. ఆ రోజు నుంచి ఆయన చంద్రబాబు అభిమానిగా మారిపోయారు. సీఎంను సచివాలయంలో ఎన్నిసార్లు చూసినా వ్యక్తగతంగా కలిసే అవకాశం మాత్రం రాలేదు. ఇటీవల సచివాలయ సంఘం ఎన్నికల్లో నూతన కార్యవర్గం విజయం సా ధించిన నేపథ్యంలో ఈ సంఘం అధ్యక్షుడు రామకృష్ణ నేతృత్వంలో ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భం గా సీఎంను ఒక్కసారైనా కలవాలన్న తన కోరికను శంకర్రావు రామకృష్ణకు తెలిపారు. దీంతో వారితోపాటు శంకర్రావును తీసుకెళ్లారు.

మీవల్లే ఉద్యోగం.. సీఎంను కలిసిన సందర్భంగా.. ‘‘మీ వల్లే నాకు ఉద్యోగం వచ్చింది. త్వరలోనే రిటైర్‌ కాబోతున్నాను.’’ అని శంకర్రావు సీఎంకు వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించారని, అప్పుడే తనకు కూడా స్థలం వచ్చిందని తెలిపారు. 2014-19 మధ్య కాలంలో ప్రభుత్వం ఉద్యోగులకు హౌస్‌ బిల్డింగ్‌ అలవెన్స్‌ను అదనంగా ఇచ్చిందని, ఆ నిధులతోనే హైదరాబాద్‌లో ఇంటిని నిర్మించుకున్నానన్నారు. ఉద్యోగం నుంచి ఇంటి వరకు తన జీవితంలో కీలకమైన ప్రతి మైలురాయి చంద్రబాబు వల్లే సాధ్యమైందని ఆయన సీఎంకు వివరించారు. ఇందంతా నవ్వుతూ విన్న చంద్రబాబు.. ‘మీరు సంతోషంగా ఉన్నారు కదా.’ అంటూ శంకర్రావును ఆప్యాయంగా పలకరించారు. కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిటైర్‌ అయిన తర్వాత ఏ అవసరం వచ్చినా తనను వచ్చి కలవాలని భరోసా ఇచ్చారు.

Updated Date - Jan 08 , 2026 | 05:49 AM