రేపు బెంగళూరుకు సీఎం
ABN , Publish Date - May 19 , 2026 | 06:21 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవా రం బెంగళూరు పర్యటనకు వెళ్లనున్నారు. మంగళవారం కావలి మండ లం తుమ్మలపెంటలో జరిగే మత్స్యకార సేవలో..
ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమానికి హాజరు
అమరావతి, మే 18(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవా రం బెంగళూరు పర్యటనకు వెళ్లనున్నారు. మంగళవారం కావలి మండ లం తుమ్మలపెంటలో జరిగే మత్స్యకార సేవలో పాల్గొన్న అనంతరం సీఎం చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కడపల్లెకు వెళ్తారు. అక్కడే రాత్రి బస చేసి ఉదయం స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బుధవారం మధ్యాహ్నం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్‌లో కార్యక్రమానికి హాజరవుతారు.