Share News

నేడు తునిలో సీఎం పర్యటన

ABN , Publish Date - Jun 01 , 2026 | 06:13 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో పర్యటించనున్నారు.

నేడు తునిలో సీఎం పర్యటన

అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను పంపిణీ చేయనున్నారు. ప్రతి నెలా ఏదో ఒక గ్రామంలో పెన్షన్ల పంపిణీకి సీఎం స్వయంగా హాజరవుతున్న విషయం తెలిసిందే. జూన్‌ ఒకటిన తుని మండలంలో చంద్రబాబు పర్యటిస్తారు. చామవరం గ్రామంలో ప్రజావేదిక నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తారు.

Updated Date - Jun 01 , 2026 | 06:14 AM