Share News

16న పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ

ABN , Publish Date - Mar 05 , 2026 | 03:48 AM

అమరావతిలో ఏర్పాటు చేస్తున్న 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణకు ముఖ్యఅతిథిగా రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్‌...

16న పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ

  • ముఖ్యఅతిథిగా హాజరుకానున్న సీఎం చంద్రబాబు

అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): అమరావతిలో ఏర్పాటు చేస్తున్న 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణకు ముఖ్యఅతిథిగా రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ డూండీ రాకేశ్‌ ఆహ్వానించారు. బుధవారం అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో చంద్రబాబును డూండీ రాకేశ్‌తోపాటు ప్రకాశ్‌ ఆర్ట్స్‌ అధినేత సుబ్బారావు, వేగ జ్యువెలరీస్‌ అధినేత నవీన్‌, ఎన్‌ఆర్‌ఐ దేసు గంగాధర్‌, కేపీసీ ప్రాజెక్టు అధినేత అనిల్‌ తదితరులు కలిశారు. అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు, ఆయన స్మారక మందిరాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 6.8 ఎకరాలు కేటాయించింది. మార్చి 16న పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని సీఎం చేతులు మీదుగా ఆవిష్కరింపచేయనున్నారు.

Updated Date - Mar 05 , 2026 | 03:48 AM