5న సాగునీటి సంఘాలతో సీఎం భేటీ
ABN , Publish Date - Feb 03 , 2026 | 04:36 AM
అమరావతి పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ నెల ఐదో తేదీన రాష్ట్ర సాగునీటి సంఘాల సమాఖ్యతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు.
అమరావతి, తుళ్లూరు, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): అమరావతి పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ నెల ఐదో తేదీన రాష్ట్ర సాగునీటి సంఘాల సమాఖ్యతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని సాగునీటి సంఘాల చైర్మన్లు, డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్ సభ్యులతో ఈ సమావేశం ఉంటుంది. నీటి యాజమాన్య నిర్వహణ, ప్రాజెక్టులలోని నీటిని చెరువుల్లో నింపడం, ఎత్తిపోతల పథకాల్లోకి తరలించడం వంటి కార్యక్రమాలపై సంఘాల సభ్యులకు సీఎం దిశానిర్ధేశం చేయనున్నారు. ‘మన నీరు-మన భవిష్యత్, సాగు నీటి సంఘాల పాత్ర’ అనే అంశంపై సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సు ఏర్పాట్లను సోమవారం జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ బి.రాంబాబుతో కలసి కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా సోమవారం పరిశీలించారు. భోజన వసతి ఏర్పాట్లు, తాగు నీరు, పారిశుధ్యం తదితర అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.