Share News

రేపు విశాఖకు... 20న ఢిల్లీకి సీఎం

ABN , Publish Date - Feb 17 , 2026 | 04:29 AM

సీఎం చంద్రబాబు బుధవారం విశాఖపట్నం పర్యటనకు వెళుతున్నారు. విశాఖలో జరిగే ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూకు....

రేపు విశాఖకు... 20న ఢిల్లీకి సీఎం

న్యూఢిల్లీ, విశాఖపట్నం, అమరావతి, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు బుధవారం విశాఖపట్నం పర్యటనకు వెళుతున్నారు. విశాఖలో జరిగే ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతున్నారు. ఫ్లీట్‌ రివ్యూలో రాష్ట్రపతితో కలసి సీఎం పాల్గొంటారు. బుధవారం ఉదయం విశాఖ బయలుదేరి వెళ్లి, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి అమరావతి చేరుకుంటారు. ఈ నెల 20న సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో పాల్గొంటారు. కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం విశాఖపట్నానికి రానున్నారు. నేవల్‌ బేస్‌లోని చోళ సూట్‌లో బస చేస్తారు. అదేరోజు రాత్రి ఆమె ప్రముఖులందరికీ తూర్పు నౌకాదళంలోని ఆఫీసర్స్‌ మెస్‌లో విందు ఇవ్వనున్నారు.

Updated Date - Feb 17 , 2026 | 04:30 AM