అనంత జలసంరక్షణపై మీ స్పందనకు వందనం!
ABN , Publish Date - Jan 26 , 2026 | 03:47 AM
అనంతపురం జిల్లాలో జలసంరక్షణ చర్యల గురించి ప్రధాని మోదీ తన మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.
మోదీకి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు
అమరావతి, జనవరి 25(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లాలో జలసంరక్షణ చర్యల గురించి ప్రధాని మోదీ తన మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. నీటి సంరక్షణలో అనంతపురం ప్రజలు చేసిన స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలను హైలెట్ చేసినందుకు మోదీకి సీఎం ధన్యవాదాలు తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ కింద నిర్దేశించుకున్న పది సూత్రాల్లో నీటి భద్రత అత్యంత ముఖ్యమని పేర్కొన్న సీఎం.. సాంప్రదాయ నీటి నిర్వహణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించి నీటి వనరులను సంరక్షిస్తున్నామని పేర్కొన్నారు. మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ సందేశం నీటి భద్రతా మిషన్‌లో మరింత ప్రోత్సాహాన్ని కలిగిస్తుందని చంద్రబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.