Share News

గడ్కరీజీ.. మీ సహకారానికి ధన్యవాదాలు: సీఎం

ABN , Publish Date - Feb 07 , 2026 | 04:55 AM

‘ఏపీలో జాతీయ రహదారుల నెట్‌వర్క్‌ అభివృద్ధికి నిరంతరాయంగా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు గడ్కరీజీ’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు

గడ్కరీజీ.. మీ సహకారానికి ధన్యవాదాలు: సీఎం

అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ‘ఏపీలో జాతీయ రహదారుల నెట్‌వర్క్‌ అభివృద్ధికి నిరంతరాయంగా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు గడ్కరీజీ’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఈమేరకు ఎక్స్‌లో స్పందించారు. ‘ఇప్పటికే ఉన్న పోర్టులతోపాటు కొత్తగా వస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుల కనెక్టివిటీపైనా కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించడం ఆనందదాయకం. హింటర్‌ ల్యాండ్‌ను(మారుమూల ప్రాంతాన్ని) పోర్టుతో అనుసంధానించడంలో మచిలీపట్నం పోర్టు కనెక్టివిటీ ప్రాజెక్టు కీలకం. దీని వల్ల రవాణా ఖర్చు భారీగా తగ్గుతుంది. రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి మేం అన్ని విధాలా సహకరిస్తాం’ అని సీఎం పేర్కొన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 04:55 AM