Share News

వైసీపీ వద్దే వద్దు

ABN , Publish Date - Jul 19 , 2026 | 02:59 AM

గొడ్డలి పార్టీని శాశ్వతంగా రాజకీయాల నుంచి నిర్మూలించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అధికారం లేనప్పుడే వైసీపీ నాయకులు రప్పా, రప్పా అని అంటున్నారని అన్నారు.

వైసీపీ వద్దే వద్దు

  • అధికారం లేకున్నా రప్పా, రప్పా అంటున్నారు

  • అధికారంలోకొస్తే పరిస్థితేంటో ఊహించుకోండి

  • అసభ్యపోస్టులు పెడుతున్నవారిని సహించేది లేదు

  • ముందుచూపుతోనే పట్టిసీమ.. కృష్ణా డెల్టాలో 50 వేలకోట్ల విలువైన పంటలను కాపాడాం

  • వంశధార నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానం

  • చెత్త సేకరణకు 1104 వాహనాలు సమకూరుస్తాం

  • చెత్త నుంచి విద్యుత్‌ తయారీకి 8 ప్లాంట్‌లు నిర్మిస్తాం

  • గుడివాడ స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్రలో సీఎం చంద్రబాబు

మచిలీపట్నం/గుడివాడ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): గొడ్డలి పార్టీని శాశ్వతంగా రాజకీయాల నుంచి నిర్మూలించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అధికారం లేనప్పుడే వైసీపీ నాయకులు రప్పా, రప్పా అని అంటున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పొట్టేళ్లను కోసి రక్తతర్పణం చేస్తున్నారని విమర్శించారు. గొడ్డలి పార్టీ అధికారంలోకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రజలు ఊహించుకోవాలన్నారు. బాబాయ్‌ని గొడ్డలితో నరికి చంపి, ఆ తరువాత గుండె నొప్పి అని ప్రచారం చేశారని అన్నారు. ఆ నెపాన్ని తనపై నెట్టి నారాసుర రక్తచరిత్ర పేరుతో దుష్ప్రచారం చేశారని విమర్శించారు. ఇప్పుడు కూటమి పాలనలో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని అన్నారు. శనివారం కృష్ణా జిల్లా గుడివాడ నియోజవర్గంలో స్వచ్ఛ ఆంధ్రా-స్వర్ణ ఆంధ్రా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయనమాట్లాడారు. ‘‘గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు చెత్తను శుభ్రం చేశారు. బూతులు తిట్టిన నోళ్లను ఓట్లతో కడిగేశారు. రాజకీయాల్లో ఇంకా క్రిమినల్స్‌ కొనసాగుతున్నారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. సోషల్‌ మీడియాను అడ్డుపెట్టుకుని అసభ్యపోస్టులు పెడుతున్నారు. ప్రజల జీవితాలకు ఆటంకాలు కలిగిస్తున్నారు. అదేమని అడిగితే భావప్రకటనా స్వేచ్ఛ అని అంటున్నారు. ఇలాంటి వారిని సహించేది లేదు. స్వచ్ఛమైన రాజకీయాలు, స్వచ్ఛమైన ప్రజాప్రతినిధులు, స్వాభిమానం అనే అంశాలను ఆధారంగా చేసుకుని టీడీపీ గత 40 సంవత్సరాలకు పైగా కొనసాగుతోంది’’ అని అన్నారు. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు తల్లికి వందనం పథకంలో 67,47,140 లక్షల మంది విద్యార్థులకు రూ.10,122 కోట్ల నగదును తల్లుల ఖాతాలలో జమ చేస్తామన్నారు. అంగన్వాడీ, స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో పని చేసే సిబ్బందికి తల్లికి వందనం జమ చేస్తామని చెప్పారు.


ఆరోగ్యం, శుభ్రత కూడా అవసరం

‘ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్రా-స్వర్ణ ఆంధ్రా కార్యక్రమంలో పాల్గొంటున్నాను. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆరోగ్యం, శుభ్రత కూడా అవసరం. ప్రజలు పూర్తిస్థాయిలో సహకరిస్తేనే స్వచ్ఛతా లక్ష్యం నేరువేరుతుంది. రోడ్లు ఊడ్చటమే పరిశుభ్రత కాదు. స్వచ్ఛ ఆంధ్రా ఉద్దేశం ఇది కాదు. పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యం మెరుగుపడేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అర్హులైన వారందరికీ సంక్షేమం, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు సంపద సృష్టిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో చెత్తాచెదారంతో నింపేసిన ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్ది ‘ఐ లవ్‌ గుడివాడ’ అనే నినాదాలతో బోర్డ్డులు ఏర్పాటు చేశాం. రెండేళ్లలో రాష్ట్రంలో 40 లక్షల టన్నుల చెత్తను తొలగించాం. తెలుగుజాతి భవిష్యత్తును తీర్చిదిద్దే బాద్యత తీసుకున్నా. 1994లోనే జన్మభూమి పేరుతో పిలుపునిస్తే రాష్ట్ర ప్రజలతో పాటు విదేశాల్లో ఉన్న ఆంధ్రులు తరలివచ్చి తమ వంతుగా సేవలు అందించారు. స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా 120 పట్టణాల్లో రూ.15,274 కోట్ల వ్యయంతో పనులు చేపడుతున్నాం. మురుగునీటి శుద్ధికి సీవేజ్‌ ప్లాంట్‌లు, మంచినీటి ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, చెరువుల పునరుద్ధరణ, డ్రెయిన్‌ల నిర్మా ణం పనులు ప్రారంభించాం. ఇంటింటికీ చెత్త సేకరణకు 126 ఎలక్ర్టికల్‌ వాహనాలను ప్రారంభించాం. త్వరలో 1104 వాహనాలను సమకూరుస్తాం. రూ. 528 కోట్ల అంచనాతో వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తాం. చెత్త నుంచి విద్యుత్‌ తయారు చేసేలా రాష్ట్రంలో ఎనిమిది ప్లాంట్‌లు నిర్మిస్తాం.’ అని అన్నారు.


48 శాతం లోటు వర్షపాతం

‘రాష్ట్రంలో ఈ ఏడాది 48 శాతం లోటు వర్షపా తం నమోదైంది. ఆల్మట్టి ప్రాజెక్టు ఇంకా నిండలేదు. కృష్ణాడెల్టాకు సాగునీటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో చేపట్టిన పట్టిసీమ ప్రాజెకు ద్వారా ఇప్పటి వరకు 450 టీఎంసీల నీటిని పంపింగ్‌ చేశాం. కృష్ణా డెల్టాలో రూ.50 వేల కోట్ల విలువైన పంటలను కా పాడి సంపద సృష్టించాం. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీటి ని కృష్ణా డెల్టాకు మళ్లిస్తాం. నదులను అనుసంధా నం చేసి రాష్ట్రంలో కరువు పరిస్థితులు తలెత్తకుం డా తాగు, సాగునీటి ఇబ్బందులు తొలగిస్తాం. యు ద్ధ వాతావరణం నేపఽథ్యంలో రొయ్యల మేతకు ఉపయోగించే ఫిష్‌ ఆయిల్‌, ముడిసరుకుల దిగుమతి నిలిచిపోయింది. కేంద్రమంత్రులతో మాట్లాడి రొయ్య ల మేత ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరాం. ఆక్వా పరిశ్రమను ఆదుకునేందుకు రూ. 1.50కే యూనిట్‌ విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం.’ అని సీఎం చంద్రబాబు అన్నారు.


మీకు మార్కులు.. మాకు ఓట్లు

ఐవీఆర్‌ఎస్‌ సర్వే ద్వారా ప్రజల సంతృప్తి స్థాయి ని తెలియజేసే నివేదికలను, వివిధ శాఖల పనితీరు ను చంద్రబాబు వెల్లడించారు. అర్జీల పరిష్కారంలో కృష్ణా జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉందంటూ కలెక్టర్‌ బాలాజీని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. మంచిగా పని చేసిన అధికారులకు మం చి మార్కులు వస్తాయని, ప్రజలు సంతృప్తి చెందితే తమకు మంచి ఓట్లు వస్తాయని అన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు, కొండపల్లి, బేతంచర్ల, పెద్దాపురం లో వే స్ట్‌మేనేజ్‌మెంట్‌ ప్లాంట్‌లను వర్చువల్‌గా సీఎం ప్రారంభించారు. గుడివాడ బస్టాండ్‌ అభివృద్ధికి రూ.3 కోట్లను విరాళంగా ఇచ్చిన నరసింహారావును సీఎం అభినందించారు.

Updated Date - Jul 19 , 2026 | 03:01 AM